vangaveeti ranga: వంగవీటి రంగా వెనకున్నది ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణేనా?... అసలు నిజమిది!

  • నెట్టింట వైరల్ అవుతున్న ఓ ఫోటో
  • రంగా వెనకున్నది రాధాకృష్ణని నమ్ముతున్న నెటిజన్లు
  • కానీ అక్కడ ఉన్నది విష్ణుమొలకల రాజహంస

గత కొన్ని రోజులుగా ఓ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాపు నేత దివంగత వంగవీటి రంగా ఓ సమావేశంలో మాట్లాడుతుండగా, ఆయనకు అనుచరుడిగా వెనక ఓ బక్క పల్చటి యువకుడు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నాడు. అతనే ప్రస్తుతం ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ న్యూస్ చానల్ ఎండీ రాధాకృష్ణన్నది జరుగుతున్న ప్రచారం.

అప్పట్లో రంగాకు ప్రధాన అనుచరుల్లో రాధాకృష్ణ ఒకరని అటు ఫేస్ బుక్, ఇటు వాట్స్ యాప్, ట్విట్టర్ తదితర సోషల్ మీడియాలో విపరీతంగా ఓ ఫొటో షేర్ అవుతోంది. రంగా వెనకున్నది రాధాకృష్ణ అని, అప్పట్లో ఆయన రంగాకు కారు డ్రైవర్ గా ఉన్నారని అత్యధికులు నమ్ముతున్నారు కూడా. ఇక ఇందులో నిజమేంటంటే... రంగా వెనకున్నది రాధాకృష్ణ కాదు.
పై ఫోటోలో మార్క్ చేసి ఉన్న రాజహంస... ఇప్పుడిలా...

ఈ విషయాన్ని అప్పటి రంగా ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్వయంగా చెప్పారు. వాట్స్ యాప్ లో సర్క్యులేట్ అవుతున్న ఫోటోలో ఉన్నది ఆంధ్రజ్యోతి ఎండీ కాదని తేల్చి చెప్పారు. అందులో ఉన్నది కస్తూరీబాయి పేటకు చెందిన న్యాయవాది విష్ణుమొలకల చక్రవర్తి సోదరుడు రాజహంసని అన్నారు.

ఆ సమావేశం తనకు గుర్తుందని అన్నారు. రాజహంస సైతం మీడియా ముందుకు వచ్చి, ఆ ఫొటో వివరాలు చెప్పారు. రంగా తెనాలి దగ్గరున్న పేరాలపాలెం వచ్చిన సమయంలో ఓ సమావేశం జరిగితే, ఆ ఫోటో అప్పుడు తీశారని రాజహంస పేర్కొన్నారు. అప్పుడు తాను చిన్న వయసు వాడినని, ఫొటో తీసిన విషయం కూడా తనకు తెలియదని అన్నారు. తన ఫొటోను రాధాకృష్ణతో పోల్చి ఇలా వైరల్ చేయడం ఓ రకంగా గర్వంగా ఉందని, మరో రకంగా బాధగా ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News