Tirupatirao Committe: స్కూలు ఫీజు ఏటా 10 శాతం పెంపు... నెలన్నర ఆలస్యమైతే టీసీ: కలకలం రేపుతున్న తిరుపతిరావు కమిటీ రిపోర్టు

  • 10 శాతానికి మించి కూడా ఫీజు పెంచే చాన్స్
  • ప్రభుత్వ అనుమతి తీసుకుంటే చాలన్న కమిటీ
  • ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలకు తలొగ్గే నివేదిక
  • మండిపడుతున్న పేరెంట్స్ అసోసియేషన్లు

తెలంగాణలో స్కూలు ఫీజలు ఎలా నియంత్రించాలన్న విషయమై కేసీఆర్ ప్రభుత్వం నియమించిన తిరుపతి రావు కమిటీ తన నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికలోని సిఫార్సులు తల్లిదండ్రుల గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ప్రతి ఏటా 10శాతం మేరకు స్కూల్ ఫీజు పెంచుకోవచ్చన్న ప్రతిపాదనతో పాటు, ఫీజు చెల్లింపు 45 రోజులు ఆలస్యమైతే, విద్యార్థికి టీసీ ఇచ్చి పంపించే హక్కు పాఠశాల యాజమాన్యానికి ఇవ్వాలని, ఒకవేళ 10 శాతానికి మించి ఫీజులను పెంచాలని భావిస్తే, అప్పుడు ప్రభుత్వ అనుమతి తప్పనిసరని రిపోర్టులో తిరుపతిరావు కమిటీ పేర్కొంది.

దాదాపు 9 నెలలుగా పలు విద్యాసంస్థలతో చర్చించిన ఈ కమిటీ చేసిన సిఫార్సులపై పేరెంట్స్ సంఘాలు మండిపడుతున్నాయి. జోనల్‌ విధానంలో ఫీజు రెగ్యులేషన్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని, స్కూల్స్‌ అడ్మిషన్లు ఆన్‌ లైన్‌ లోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కూడా తిరుపతిరావు తన నివేదికలో ప్రతిపాదించారు. ప్రైవేట్‌ స్కూల్‌ యాజమాన్యాలకు తలొగ్గి ఈ నివేదికను తయారు చేసినట్టు ఉందని పేరెంట్స్‌ అసోసియేషన్స్‌ ప్రతినిధులు మండిపడుతున్నారు.

More Telugu News