cry: అందుకే మగవారి కంటే ఆడవారే ఎక్కువగా ఏడుస్తారట!

  • ఆడ‌వారు, మ‌గ‌వారిలో వేరువేరుగా మెదడు ఆకారం
  • పురుషుల‌ మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువ
  • స్విట్జర్లాండ్‌లోని బెసేల్‌ విశ్వవిద్యాలయం ప‌రిశోధ‌కుల వెల్లడి

ఏదైనా చిన్న‌ క‌ష్టం వ‌చ్చినా ఆడ‌వారు క‌న్నీరు పెట్టుకుంటారు. కానీ పురుషులు మాత్రం అంత ఈజీగా క‌న్నీరు పెట్టుకోరు. తాజాగా మ‌హిళ‌లు, పు‌రుషుల్లో భావ నియంత్రణపైన పరిశోధన జరిపిన స్విట్జర్లాండ్‌లోని బెసేల్‌ విశ్వవిద్యాలయం ప‌రిశోధ‌కులు కొన్ని ఆసక్తిక‌ర విషయాలను గుర్తించారు.

ఆడ‌వారు, మ‌గ‌వారిలో మెదడు ఆకారం వేరువేరుగా ఉంటుందని, ప‌రుషుల‌ మెదడులో భావోద్వేగాలను అదుపులో ఉంచే భాగం 19 శాతం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ కారణంగానే పు‌రుషుల్లో ఏడుపును నియంత్రించే సామర్థ్యం అధిక‌మ‌ని తేల్చి చెప్పారు. అందుకే మగవారికి భావోద్వేగాల‌కు గురైన‌ప్ప‌టికీ ఏడ‌వ‌బోర‌ని చెప్పారు.

More Telugu News