mahesh bhagavath: అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలు విస్తృతం: రాచ‌కొండ‌ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్‌

  • న్యూ ఇయర్ వేడుక‌ల నేపథ్యంలో రాచ‌కొండ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు
  • ఈ నెల 31 రాత్రి 11 నుంచి జనవరి 1 ఉదయం 5 వరకు అమలు
  • రాచకొండ పరిధిలోని ఓఆర్ఆర్ రహదారులు మూసివేత
  • విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మినహాయింపు

నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల నేప‌థ్యంలో ర‌హ‌దారుల‌పై అతివేగం, ట్రిపుల్ రైడింగ్, డ్రంకెన్ డ్రైవ్ త‌నిఖీలను ముమ్మరం చేస్తున్న‌ట్లు రాచ‌కొండ‌ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ తెలిపారు. ఈ రోజు ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.... రాచ‌కొండ ప‌రిధిలో ట్రాఫిక్ ఆంక్ష‌లు ఉంటాయని చెప్పారు.

ఈ నెల 31న రాత్రి 11 నుంచి జనవరి 1న ఉదయం 5 వరకు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమలులో ఉంటాయని చెప్పారు. ఆ సమయంలో తారామ‌తి పేట‌, ఘ‌ట్‌కేస‌ర్‌, కీస‌ర, పెద్ద అంబ‌ర్‌పేట‌, బొంగులూరు, తుక్కుగూడ వ‌ద్ద ఓఆర్ఆర్ ప్ర‌వేశ ద్వారం మూసివేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయం వెళ్లే వాహనాలకు మాత్రం మినహాయింపు ఉంటుందని పేర్కొన్నారు. న్యూ ఇయర్ ఈవెంట్ల నిర్వాహ‌కులు నిబంధ‌న‌ల‌ను పాటించాలని సూచించారు.  

More Telugu News