lindsey lohan: పాము కాటుకు గురైన హాలీవుడ్ హీరోయిన్.. సేఫ్!

  • లిండ్సే లోహన్ కు పాము కాటు
  • ఫుకెట్ ద్వీపంలో ఘటన
  • క్షేమంగానే ఉన్నానన్న లిండ్సే
ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ లిండ్సే లోహన్ పాము కాటుకు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమే వెల్లడించింది. టూర్ వెకేషన్ ట్రిప్ లో భాగంగా అండమాన్ సముద్ర ప్రాంతంలో ఉన్న ఫుకెట్ ఐలాండ్ పైకి ఎక్కుతున్నప్పుడు పాము కరిచిందని తెలిపింది. అయితే, ఎలాంటి ప్రమాదం సంభవించలేదని... తాను సురక్షితంగానే ఉన్నానని చెప్పింది. ఫుకెట్ చాలా అందమైన ప్రదేశమని... వ్యక్తిగతంగా ఈ ప్రదేశమంటే తనకు ఎంతో ఇష్టమని తెలిపింది. ఈ సందర్భంగా అభిమానులందరికీ న్యూ ఇయర్ విషెస్ తెలిపింది. దేవుడి ఆశీస్సులు అందరికీ ఉండాలని ఆకాంక్షించింది. పాము కాటుకు సంబంధించిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ లో అప్ లోడ్ చేసింది.
lindsey lohan
lindsey lohan snake byte

More Telugu News