Rajyasabha: అరవింద్ కేజ్రీవాల్ ది మరీ చప్రాసీ బతుకైంది!

  • నిత్యమూ అవమానాలను ఎదుర్కొంటున్న కేజ్రీవాల్
  • ఢిల్లీ సర్కారుకు మరిన్ని అధికారాలు ఇవ్వాల్సిందే
  • రాజ్యసభలో సమాజ్ వాదీ, తృణమూల్, సీపీఐ, సీపీఎం

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ కు, లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్ కు మధ్య కొనసాగుతున్న యుద్ధంలో రాజ్యసభ వేదికగా, విపక్షాల నుంచి కేజ్రీకి అనూహ్య మద్దతు లభించింది. నాలుగు పార్టీల నేతలు ఢిల్లీ పరిపాలనలో ఎల్జీ జోక్యం పెరిగిపోయిందని, ఇందుకు కారణం బీజేపీయే అని ఆరోపిస్తూ, అరవింద్ కేజ్రీవాల్ ది దేశ రాజధానిలో చప్రాసీ బతుకైపోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ ప్రసంగిస్తూ, నిత్యమూ ఆయనకు అవమానాలు ఎదురవుతున్నాయని, ప్రభుత్వానికి పవర్ లేకుండా చేశారని ఆరోపించారు. ఢిల్లీ సర్కారుకు మరిన్ని అధికారాలు ఇవ్వాలని ఆయన చేసిన డిమాండ్ కు తృణమూల్ కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం పార్టీలు మద్దతు పలికాయి. తొలుత నజీబ్ జంగ్, ఆ తరువాత బైజల్ లు అధికారాన్ని తమ గుప్పిట్లో పెట్టుకున్నారని, తాను ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో 'ఇంటింటికీ ప్రజా సేవలు' పేరిట అరవింద్ కొత్త పథకాన్ని ప్రారంభించగా, దానికి ఎల్జీ అడ్డుపుల్ల వేశారని ఆరోపించారు.

More Telugu News