Narendra Modi: నరేంద్ర మోదీకి ఎంపీలెవరూ గుడ్ మార్నింగ్ చెప్పడం లేదట!

  • మోదీ యాప్ ద్వారా ప్రధాని సందేశాలు
  • పలు విషయాలను కూడా ఎంపీలు విస్మరిస్తున్నారన్న మోదీ
  • యాప్ ను విరివిగా వాడాలంటూ సూచన
తనకు ఎవరూ గుడ్ మార్నింగ్ చెప్పడం లేదంటూ ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. నరేంద్ర మోదీ యాప్ ద్వారా తాను ప్రతి ఉదయం బీజేపీ ఎంపీలందరికీ గుడ్ మార్నింగ్ చెబుతున్నానని... కానీ, ఎవరూ ప్రతిస్పందించడం లేదని ఆయన అన్నారు. ఓ ఐదారుగురు ఎంపీలు మాత్రమే తన సందేశాలకు ప్రతిస్పందిస్తున్నారని చెప్పారు.

మిగిలినవారు గుడ్ మార్నింగ్ తో పాటు, తాను పంపే ముఖ్యమైన విషయాలను కూడా విస్మరిస్తున్నారని అన్నారు. మోదీ యాప్ ను వాడాలంటూ ఆయన ఎంపీలకు సూచించారు. ఈ యాప్ ను 2015లో ప్రారంభించారు. గుజరాత్ ఎన్నికల్లో కూడా మోదీ ఈ యాప్ ను విరివిగా వాడారు.
Narendra Modi
modi app

More Telugu News