rajanikanth: నిన్న శివాజీ గణేషన్, ఇప్పుడు నేను, రేపు మరొకరు!: రజనీకాంత్

  • జీవితంలో ఏదీ శాశ్వతం కాదు
  • మీ బాధ్యతలను మర్చిపోవద్దు
  • రజనీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్న తమిళ తంబీలు
డిసెంబర్ 31 వచ్చేస్తోంది. తమిళనాడులో ఉత్కంఠ పెరిగిపోతోంది. దీనికంతటికీ కారణం ఆ రోజు సూపర్ స్టార్ రజనీకాంత్ చేయనున్న ప్రకటన. తన అభిమానులతో రజనీకాంత్ సమావేశాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రజనీ మాట్లాడుతూ, "మరో రెండు రోజులు మాత్రమే మిగిలి వున్నాయి. మీరంతా నా రాజకీయ ప్రవేశానికి సంబంధించిన సమాధానం కోసం వేచి చూస్తున్నారు. మన జీవితంలో ఏదీ శాశ్వతం కాదు. హోదా, సంపాదన కంటే సమయం చాలా విలువైనది. నిన్న శివాజీ గణేషన్, ఇప్పుడు నేను, రేపు మరొకరు. మీ బాధ్యతలను మీరెప్పుడూ మర్చిపోవద్దు" అని అన్నారు.

మరోవైపు, రజనీ రాజకీయ అరంగేట్రంపై పార్టీలు ఆసక్తిగా ఉన్నాయి. రజనీ పొలిటికల్ ఎంట్రీని బీజేపీ స్వాగతించింది. రానున్న రోజుల్లో తమిళనాడులో ప్రత్యామ్నాయం ఏర్పడుతుందని తెలిపింది. రజనీ వల్ల తమిళనాడుకు మేలు జరుగుతుందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.
rajanikanth
rajani political entry

More Telugu News