KCR: దేశంలో ఎక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనం నిర్మిస్తాం: మంత్రి తలసాని

  • ఈ నెల 29న కోకాపేటలో సీఎం కేసీఆర్ పర్యటన
  • ఏర్పాట్లను పరిశీలించిన తలసాని
  • పది ఎకరాల్లో గొల్లకురుమల భవనం, హాస్టల్ నిర్మిస్తామన్న మంత్రి
దేశంలో మరెక్కడా లేని విధంగా గొల్లకురుమల భవనాన్ని నిర్మిస్తామని తెలంగాణ పశుసంవర్థక, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోమారు స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని కోకాపేటలో ఈ నెల 29న సీఎం కేసీఆర్ పర్యటించనున్న సందర్భంగా ఆయా ఏర్పాట్లను తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పది ఎకరాల స్థలంలో పది కోట్ల రూపాయలతో గొల్లకురుమల భవనాన్ని, హాస్టల్ ను నిర్మిస్తామని, సీబీఐటీ కళాశాల ప్రాంగణంలో గొల్ల కురుమల ప్రతినిధులతో బహిరంగ సభను నిర్వహించనున్నట్టు చెప్పారు.
KCR
TALASANI

More Telugu News