jio: జియోకు కౌంట‌ర్‌గా ఐడియా కొత్త ఆఫ‌ర్‌!

  • రూ. 309 ప్లాన్‌లో స్వ‌ల్ప మార్పులు
  • రోజుకి 1.5 జీబీ డేటా
  • అన్‌లిమిటెడ్ లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్‌

టెలికాం రంగంలో విప్ల‌వం తీసుకువ‌చ్చిన జియో రీఛార్జీ ప్లాన్ల పోటీని త‌ట్టుకోవ‌డానికి ఇత‌ర టెలికాం సంస్థ‌లు చాలా క‌ష్టాలు ప‌డాల్సివస్తోంది. ఇటీవ‌ల న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా రూ. 199, రూ. 299 రీఛార్జీ ప్లాన్ల‌ను జియో ప్ర‌వేశ‌పెట్టిన సంగ‌తి తెలిసిందే. వీటికి కౌంట‌ర్‌గా ఐడియా సెల్యూలర్ కొత్త ఆఫ‌ర్‌ను ప్ర‌వేశ‌పెట్టింది. నిజానికి ఉన్న ఆఫ‌ర్‌నే స‌రిచేసింద‌ని చెప్ప‌వ‌చ్చు.

ఇప్ప‌టివ‌ర‌కు రూ. 309కి రోజుకి 1 జీబీ డేటాను మాత్ర‌మే ఐడియా ఇచ్చేది. ఇక నుంచి రోజుకి 1.5 జీబీ డేటాను ఇవ్వ‌నుంది. అలాగే లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్ మీద కూడా కొన్ని ష‌ర‌తులు ఉండేవి. కానీ కొత్త మార్పుల ప్ర‌కారం 28 రోజుల పాటు లోక‌ల్‌, ఎస్‌టీడీ కాల్స్ మీద ఎలాంటి ప‌రిమితి లేద‌ని ప్ర‌క‌టించింది. అలాగే రోజుకి 100 ఎస్సెమ్మెస్‌ల‌ను కూడా అందించ‌నుంది.

More Telugu News