venkatesh: వెంకటేశ్ సరసన కథానాయిక ఖాయమైపోయింది!

  • తేజతో వెంకటేశ్ మూవీ
  • హీరోయిన్ గా అదితీరావుకి ఛాన్స్
  • త్వరలో రెగ్యులర్ షూటింగ్ మొదలు        

తేజ దర్శకత్వంలో వెంకటేశ్ విభిన్నమైన కథా చిత్రాన్ని చేయడానికి సిద్ధమవుతున్నారు. కథను బట్టి ఈ సినిమాకి ' ఆటా నాదే వేటా నాదే' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనుంది.

ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం సంప్రదింపులు జరుగుతున్నాయంటూ, అనుష్క .. కాజల్ .. తమన్నాల పేర్లు తెరపైకి వచ్చాయి. కానీ ఈ సినిమా కోసం అదితీరావును ఎంపిక చేశారనేది తాజా సమాచారం. ఆమెతో మాట్లాడటం .. అగ్రిమెంట్ తతంగం పూర్తికావడం జరిగిపోయిందని అంటున్నారు. మణిరత్నం సినిమా 'చెలియా' ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అదితీరావు, ప్రస్తుతం తెలుగులో ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాలో చేస్తోంది. తాజాగా తేజ సినిమాకి సైన్ చేసిందన్న మాట. చూస్తుంటే అదితీరావు తెలుగులో మరిన్ని ఛాన్సులు పట్టేలానే వుంది.     

More Telugu News