stocks: 2018లో ఈ స్టాక్స్ తో అధిక లాభాలు!: 'బ్లూంబర్గ్' సిఫార్సులు

  • 50 స్టాక్స్ తో బ్లూంబర్గ్ జాబితా విడుదల
  • 25-60 శాతం వరకు లాభాలకు అవకాశం
  • జాబితాలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్, క్యాపిటల్ ఫస్ట్, ఎంసీఎక్స్

షేర్ మార్కెట్ అనేది అంతా దైవాదీనం అంటారు. అయితే, మంచి షేర్లను ఎంచుకుని వాటిలో దీర్ఘకాలం పాటు పెట్టుబడులు కొనసాగిస్తే నష్టపోయే అవకాశాలు దాదాపుగా ఉండవు. అందుకే స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి సరైన అవగాహన, విషయ పరిజ్ఞానం అవసరం. ఇది లేని వారు మార్కెట్ విశ్లేషకులు, పండితుల సూచనలను పాటించడంలో సందేహించాల్సిన అవసరం లేదు. బ్లూంబర్గ్ సంస్థ 2018 సంవత్సరంలో 25 శాతం నుంచి 60 శాతం వరకు పెరిగేందుకు అవకాశం ఉన్న 50 షేర్ల జాబితాను విడుదల చేసింది. ఈ సూచనల వెనుక విశ్లేషకుల సిఫారసులు కూడా ఉన్నాయి.

సింటెక్స్ ఇండస్ట్రీస్, న్యూలాండ్ ల్యాబ్, సుజ్లాన్ ఎనర్జీ, బలరామ్ పూర్ చిని మిల్స్, సువెన్ లైఫ్ సైన్సెస్, ఎంసీఎక్స్, క్యాపిటల్ ఫస్ట్, ఫ్యూచర్ లైఫ్ స్టయిల్, ఫోర్టిస్ హెల్త్ కేర్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, మిర్జా ఇంటర్నేషనల్, సాగర్ సిమెంట్స్, మాజెస్కో, చంబల్ ఫర్టిలైజర్స్, డిష్ టీవీ, స్ట్రైడ్స్ షాసన్, బీఎస్ఈ, జీఐసీ హౌసింగ్ ఫైనాన్స్, యూపీఎల్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్ప్, హిందుస్తాన్ మీడియా, ఫెడరల్ బ్యాంకు, తల్వాల్కర్ బెటర్ వ్యాల్యూ, జమ్మూ అండ్ కశ్మీర్ బ్యాంకు ఈ జాబితాలో ఉన్నాయి. ఇవన్నీ బ్లూంబర్గ్ అంచనాలు మాత్రమే. విడిగా ఒక్కోస్టాక్ ను ఒకరికి మించి అనలిస్టులు సిఫారసు కూడా చేసి ఉన్నారు. 

More Telugu News