Chandrababu: ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత!

  • కూలగొట్టిన తమ ఇళ్లకు ఇంత వరకు నష్ట పరిహారం చెల్లించలేదు
  • సీఎం నివాసం వద్ద ఇబ్రహీంపట్నం వాసుల ధర్నా
  • పెట్రోల్ పోసుకుని తగలబెట్టుకోబోయిన యువకుడు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉండవల్లి నివాసం వద్ద ఈ ఉదయం ఉద్రిక్తత చోటు చేసుకుంది. విజయవాడలోని ఇబ్రహీంపట్నం వాసులు పెట్రోల్ బాటిళ్లు వెంట బెట్టుకుని ధర్నాకు దిగారు. రోడ్డు విస్తరణ కోసం తమ ఇళ్లను కూలదోసి, నష్ట పరిహారం చెల్లించకుండా మూడేళ్ల నుంచి తప్పించుకు తిరుగుతున్నారంటూ వారు ఆరోపించారు. ఈ నేపథ్యంలో, ఓ యువకుడు పెట్రోల్ పోసుకుని తగల బెట్టుకోబోయాడు. వెంటనే భద్రతా సిబ్బంది ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మిగతా వారి వద్ద ఉన్న పెట్రోల్ బాటిళ్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.

తమ ఆవేదనను చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి వద్దకు వస్తే, ఆయన తమకు సమయం ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. 10 రోజుల్లోనే నష్ట పరిహారం చెల్లిస్తామని అప్పుడు హామీ ఇచ్చారని... మూడేళ్లయినా తమను తిప్పుతూనే ఉన్నారని అన్నారు. తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడ నుంచి కదలబోమని భీష్మించుకు కూర్చున్నారు.
Chandrababu
tension at chandrababu residence

More Telugu News