Chennai: ఒక్క నాలుగు రోజులు ఆగండి.. చెబుతా!: రజనీకాంత్

  • అభిమానులతో వరుస భేటీలు జరుపుతున్న రజనీకాంత్
  • కుటుంబం తరువాతే మరో విషయాన్ని ఆలోచించాలని ఫ్యాన్స్ కు సలహా
  • ఇంకా మాట్లాడుకోవాల్సింది ఉందన్న తలైవా
సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు రాజకీయాల్లోకి వస్తారా? అని ఆయన అభిమానులంతా అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ, మరోసారి అభిమానులతో సమావేశాలు నిర్వహిస్తున్న ఆయన, కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పదే పదే ఒకే విషయాన్ని చెబుతున్నానని ఎవరూ అన్యధా భావించవద్దని, తొలుత కుటుంబం, ఆ తరువాతే మరెవరి గురించైనా ఆలోచించాలని అభిమానులకు పిలుపునిచ్చారు.

మరో నాలుగు రోజులు ఓపిక పట్టాలని, తాను అన్ని విషయాలూ చెబుతానని అన్నారు. ఇంకా మాట్లాడుకోవాల్సింది ఎంతో ఉందని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ప్రతి ఒక్కరికీ వాళ్ల పిల్లలే ఆస్తి అని, వారిని బాగా చదివించుకోవాలని, జీవించి ఉన్న దైవాలుగా తల్లిదండ్రులను గౌరవించాలని ఫ్యాన్స్ కు సలహా ఇచ్చారు.
Chennai
Rajanikant
Poloticle Entry
Fans

More Telugu News