Andhra Pradesh: రాష్ట్రపతి సతీమణికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఊపిరి పీల్చుకున్న అధికారులు

  • దుర్గమ్మ దర్శన సమయంలో ఘటన
  • ఐరన్ ర్యాంపు తగిలి కింద పడబోయిన సవితా కోవింద్
  •  పట్టుకున్న సెక్యూరిటీ సిబ్బంది.. తప్పిన ప్రమాదం

రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సతీమణి సవితా కోవింద్‌కు తృటిలో ప్రమాదం తప్పింది. బుధవారం కుమార్తె స్వాతితో కలిసి బెజవాడ కనకదుర్గమ్మను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి దర్శనం అనంతరం రాజగోపురం లోపలకు వెళ్తున్న సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన ఐరన్ ర్యాంపు వద్ద సవిత అదుపు తప్పి జారిపోయారు. వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను కిందపడకుండా పట్టుకున్నారు. దీంతో అందరూ  ఊపిరి పీల్చుకున్నారు. అమ్మవారి దర్శనం అనంతరం రాష్ట్రపతి కుటుంబ సభ్యులు కృష్ణానదిలో విహరించారు. భవానీ ద్వీపాన్ని సందర్శించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టును ప్రారంభించేందుకు రాష్ట్రపతి కోవింద్ కుటుంబ సభ్యులతో  కలిసి అమరావతి చేరుకున్నారు. ఈ సందర్భంగా సవిత, స్వాతిలు కలిసి దర్శనీయ స్థలాలను సందర్శించారు. ఇక ఫైబర్ గ్రిడ్‌తోపాటు మరో నాలుగు ప్రాజెక్టులను ప్రారంభించిన రాష్ట్రపతి ప్రణాళికలు రూపొందించడం, వాటిని అమలు చేయడంలో బెస్ట్ అంటూ కొనియాడారు.

More Telugu News