vanita reddy: పోలీసుల‌కు ఆధారాలు స‌మ‌ర్పించాను.. విజ‌య్ ఆత్మ‌హ‌త్య చేసుకునే ముందు అందుకే సెల్ఫీ వీడియో తీశాడు: వ‌నితారెడ్డి

  • హాస్య‌న‌టుడు విజ‌య్ సాయి ఆత్మ‌హ‌త్య కేసు
  • ఏయే ఆధారాలు స‌మ‌ర్పించానో మీడియాకు త్వ‌ర‌లోనే తెలుస్తుంది
  • త‌ప్పుని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి నా అత్తామామ‌లు ఎన్నో వ్యాఖ్య‌లు చేస్తున్నారు
  • ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ నాపై క‌క్ష తీర్చుకోవాల‌ని సెల్ఫీ వీడియో

హాస్య‌న‌టుడు విజ‌య్ ఆత్మ‌హ‌త్య కేసులో ఆయ‌న భార్య ఈ రోజు పోలీసుల‌కు ప‌లు ఆధారాల‌ను స‌మ‌ర్పించింది. త‌న‌పై త‌న అత్తామామ‌లు ఆరోప‌ణ‌లు చే‌స్తోన్న నేప‌థ్యంలో తాను ఆధారాల కోస‌మే ఇన్నాళ్లూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాన‌ని చెప్పింది. త‌న అత్తామామ‌లు త‌ప్పుని క‌ప్పిపుచ్చుకోవ‌డానికి ఎన్నో వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని ఆరోపించింది. త‌మ‌ పాప మీద విజ‌య్ కు అంత‌గా ఇష్టం ఉండి ఉంటే ఆత్మ‌హ‌త్య చేసుకునేవాడు కాదని చెప్పింది. తాను మాట్లాడుతున్న‌ట్లు బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆడియోను మీడియా త‌ప్పుగా వినిపించిందని పేర్కొంది.

త‌న భ‌ర్త ఎందుకు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడో తెలియ‌డం లేదని వనితారెడ్డి తెలిపింది. 'మూడున్న‌రేళ్లుగా ఆయ‌న‌కు దూరంగా ఉన్నాను.. నాకెలా తెలుస్తుంది.. ఆయ‌న చేసిన త‌ప్పుల‌ని బ‌య‌ట పెట్ట‌డం కోసం ఇన్ని రోజులూ అజ్ఞాతంలో ఉన్నాను. ఆత్మ‌హ‌త్య చేసుకుంటూ నాపై క‌క్ష తీర్చుకోవాల‌ని సెల్ఫీ వీడియో తీశాడు. విజ‌య్ అమ్మానాన్న‌లే న‌న్ను ఇలా ఇరికించాల‌ని చెప్పి ఉంటారు.. కుట్ర పూరితంగా నా పేరు చెప్పారు' అని వ‌నితారెడ్డి వ్యాఖ్యానించారు.        

More Telugu News