yogi: షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగి అరెస్ట్‌!

  • న‌టి హారిక‌ను వేధించాడంటూ ఆరోప‌ణ‌లు
  • హారిక వాట్సప్‌లో చాట్‌ చేసినట్టు యోగి విడుద‌ల చేసిన వీడియో అవాస్త‌వం
  • యోగి నాపై అసత్య ప్రచారం చేస్తున్నాడు-హారిక‌

షార్ట్‌ఫిల్మ్‌ డైరెక్టర్‌ యోగిని పోలీసులు ఎట్ట‌కేల‌కు అరెస్ట్ చేశారు. ఇటీవ‌ల షార్ట్‌ఫిల్మ్‌ నటి హారిక.. త‌న‌ను యోగి వేధించాడంటూ పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో యోగిని ఓ పోలీసు ఉన్న‌తాధికారి పోలీస్‌స్టేష‌న్‌లోనే కొట్టిన వీడియో వైర‌ల్‌గా మారింది.

ఈ కేసులో విచార‌ణ కొన‌సాగుతోంద‌ని హైద‌రాబాద్‌లోని గ‌చ్చిబౌలి పోలీసులు చెప్పారు. కాగా, వాట్సప్‌లో త‌న‌తో హారిక‌ చాట్‌ చేసినట్టు యోగి ఓ వీడియోను విడుద‌ల చేశాడు. ఆ వీడియో అంతా అస‌త్య‌మ‌ని హారిక తెలిపింది. ఈ కేసులో పోలీసులు మ‌రిన్ని విష‌యాల‌ను రాబ‌డుతున్నారు.     

  • Loading...

More Telugu News