President of India: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి సతీమణి

  • సవిత కోవింద్ కు పూర్ణ కుంభంతో స్వాగతం  
  • ప్రత్యేక పూజల నిర్వహణ
  • సవిత కోవింద్ వెంట మంత్రి అఖిలప్రియ, నన్నపనేని రాజకుమారి
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవిత కోవింద్ ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులు ఈ రోజు అమరావతికి విచ్చేసిన సంగతి విదితమే. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో కోవింద్ పాల్గొనగా, ఆయన సతీమణి సవిత కోవింద్ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం, అమ్మవారిని దర్శించుకున్న సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, దేశ ప్రథమ పౌరురాలి వెంట మంత్రి అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఉన్నారు.
President of India
Ram Nath Kovind

More Telugu News