sunil: అమెరికా ప్రేక్ష‌కుల‌కు 'టూ కంట్రీస్' చిత్రం ఫ్రీ టికెట్ల ఆఫర్!

  • 50 మందికి ఉచితంగా టికెట్లు
  • కాంటెస్ట్‌లో పాల్గొని గెల్చుకోవ‌చ్చు
  • వెల్ల‌డించిన నిర్మాణ సంస్థ‌

ఎన్‌. శంక‌ర్ ద‌ర్శ‌కత్వంలో సునీల్, సంజ‌నా ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన టూ కంట్రీస్ చిత్రం డిసెంబ‌ర్ 29న విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికాలో నివ‌సించే భార‌త ప్రేక్ష‌కుల కోసం చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా గ్రూప్ వారు ఓ కాంటెస్ట్ నిర్వ‌హిస్తున్నారు. ఇందులో విజేత‌లుగా నిలిచిన 50 మందికి ఉచితంగా సినిమా చూసే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు.

ఇందులో పాల్గొనాలంటే... అమెరికా కుటుంబ జీవితానికి, భార‌త కుటుంబ జీవితానికి మ‌ధ్య క‌నిపించిన తేడాల‌ను వివ‌రిస్తూ ఓ సెల్ఫీ వీడియో రికార్డు చేసి 8790120628 నెంబ‌ర్‌కి వాట్సాప్ చేయాలి. అంతేకాకుండా వారి యూట్యూబ్ ఛాన‌ల్‌కి కూడా స‌బ్‌స్క్రైబ్ చేసుకుని ఉండాలి. ఈ కాంటెస్ట్ గురించిన మ‌రిన్ని వివ‌రాల‌ను కింది వీడియోలో తెలుసుకోవ‌చ్చు.

More Telugu News