Chandrababu: ఆర్థిక నిపుణులు విలువైన సూచనలు ఇవ్వాలి: చంద్రబాబు

  • రంగరాజన్ ఆర్థిక సలహాలు ఇచ్చేవారు
  • 2020 నాటికి ఏపీని మూడో స్థానంలో నిలుపుతాం
  • ఆర్థికవేత్తలు విలువైన సలహాలు ఇవ్వాలి

2020 నాటికి దేశంలో ఏపీని మూడో స్థానంలో నిలబెడుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఏపీకి వెయ్యి కిలోమీటర్ల సముద్రతీరంతో పాటు అపారమైన వనరులు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఆర్థిక సమస్యలు ఉన్నప్పటికీ, గత మూడేళ్లుగా వృద్ధి రేటును సాధిస్తున్నామని చెప్పారు.

ఆర్థికవేత్తలు విలువైన సూచనలు ఇవ్వాలని కోరారు. ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాజీ గవర్నర్ రంగరాజన్ తనకు సలహాలు ఇచ్చేవారని చెప్పారు. రంగరాజన్ వంటి ఆర్థికరంగ నిపుణుడు ఏపీకి గవర్నర్ గా పనిచేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. తాను కూడా ఎకనామిక్స్ విద్యార్థినే అని చెప్పారు. నాగార్జున యూనివర్శిటీలో జరిగిన ఇండియన్ ఎకనామిక్ అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశాన్ని రాష్ట్రపతి కోవింద్ ప్రారంభించారు. 

  • Loading...

More Telugu News