sbi: ఆ చెక్ బుక్ లు మార్చుకోండి.. ఎస్బీఐలో విలీనమైన బ్యాంకుల ఖాతాదారులకు సూచన!

  • ఎస్బీఐలో విలీనమైన ఆరు బ్యాంకులు
  • పాత్ చెక్ బుక్ లు మార్చుకోవాలన్న ఎస్బీఐ
  • తుది గడువు డిసెంబర్ 31

ఆరు బ్యాంకులను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్ లు, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లు చెల్లవు. ఈ బ్యాంక్ ల ఖాతాదారులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే వెంటనే తమ పాత చెక్ బుక్ లను మార్చుకోవాలని, ఐఎఫ్ఎస్ సీ కోడ్ లను తెలుసుకోవాలని ఎస్బీఐ తన ఖాతాదారులకు సూచించింది. వాస్తవానికి పాత్ చెక్ బుక్ లను మార్చుకునేందుకు సెప్టెంబర్ 30వ తేదీని ఎస్బీఐ గడువుగా నిర్ధారించింది. ఆ తర్వాత గడువును డిసెంబర్ 31కు పొడిగించింది.

ప్రస్తుతం గడువు దగ్గర పడుతుండటంతో... ఎస్బీఐ మరోసారి సూచన చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ రాయ్ పూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్ కోర్ సహా భారతీయ మహిళా బ్యాంకులు ఎస్బీఐలో విలీనమయ్యాయి. కొత్త చెక్ బుక్ లను పొందడానికి బ్యాంకు శాఖను సంప్రదించవచ్చని, లేకపోతే ఏటీఎం, ఎస్బీఐ మొబైల్ యాప్ ద్వారానైనా వీటిని పొందవచ్చని ప్రకటించింది.

More Telugu News