Car: మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం.. కారులో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం

  • నవాబ్‌పేట మండలం జంగమాయిపల్లిలో ఘటన
  • ప్రమాదంపై పోలీసుల అనుమానాలు
  • హత్య కోణంలో దర్యాప్తు
మహబూబ్‌నగర్ జిల్లాలో విషాదం నెలకొంది. కారు దగ్ధమై వ్యక్తి సజీవ దహనమయ్యాడు. నవాబ్‌పేట మండలం జంగమాయిపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. టీఎస్08ఈయూ 1120 కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నికీలలు చుట్టుముట్టడంతో తప్పించుకునే మార్గంలేక అందులోని వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే కారు బూడిదైంది.

ఈ ఘటనపై  పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా? లేక హత్యా? అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. కారులో ఉన్న వ్యక్తి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చాడు? ప్రమాదం ఎలా  జరిగింది? అన్న వివరాలను విచారణ అనంతరం వెల్లడిస్తామని పేర్కొన్నారు.
Car
Accident
Fire
Mahaboobnagar
Telangana

More Telugu News