ram gopal varma: పూరి ‘హగ్’పై దర్శకుడు వర్మ ప్రశంసలు!

  • పూరీ జగన్ ‘హగ్’ చూశాను
  • అద్భుతమైన కళాఖండం
  • భిన్నమైన భావోద్వేగాలు, ఉత్తేజం.. కలిగిస్తుంది 

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తన తొలి షార్ట్ ఫిల్మ్ ‘హగ్’ను త్వరలో విడుదల చేస్తానని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా స్పందించారు. ‘పూరీ జగన్ ‘హగ్’ మొత్తం ఇప్పుడే చూశాను..అద్భుతమైన కళాఖండం. భిన్నమైన భావోద్వేగాలు, ఉత్తేజం, తాదాత్మ్యం, ప్రేరణ..వంటివి కలిగిస్తుంది’ అని వర్మ ప్రశంసించారు.

ఈ సందర్భంగా పూరీ ఇటీవల పోస్ట్ చేసిన ‘హగ్’ పోస్టర్ ని వర్మ తన ఖాతాలో జతపరిచారు. కాగా, ఈ నెల 31న ఉదయం పది గంటలకు ‘హగ్’ను విడుదల చేయనున్నట్టు పూరీ ఇటీవల పేర్కొన్నారు. ’గెట్ రెడీ ఫర్ దిస్ వన్’ అంటూ తన అభిమానులకు ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా పూరీ చెప్పడం తెలిసిందే.  

More Telugu News