truck: బాలుడిపై నుంచి వెళ్లిన ట్రక్.. గాయాల‌తో బ‌య‌ట‌ప‌డ్డ చిన్నారి.. వీడియో ఇదిగో!

  • చైనాలోని జిబో సిటీలో ఘ‌ట‌న‌
  • కెమెరాకు చిక్కిన యాక్సిడెంట్ దృశ్యాలు
  • ఆసుప‌త్రిలో కోలుకుంటోన్న బాలుడు

ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లిన ఓ బాలుడు ట్ర‌క్ కింద ప‌డిపోయిన ఘ‌ట‌న చైనాలోని జిబో సిటీలో చోటు చేసుకుంది. అదృష్ట‌వ‌శాత్తూ ఆ చిన్నారి కాలికి గాయంతో బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆడుకుంటూ రోడ్డుపైకి వెళ్లిన బాలుడిని గ‌మ‌నించని మినీ ట్ర‌క్ డ్రైవ‌ర్ అలాగే త‌న వాహ‌నాన్ని ముందుకు తీసుకెళ్ల‌డంతో ఆ బాలుడు దాని కిందే ప‌డిపోయాడు. అనంత‌రం ఆ డ్రైవ‌ర్ వాహ‌నాన్ని ఆపాడు. ఇంత‌లో వ‌చ్చిన ఆ బాలుడి త‌ల్లి త‌న కుమారుడిని ఆసుప‌త్రికి త‌ర‌లించింది. ప్ర‌స్తుతం ఆ బాలుడికి ఆసుప‌త్రిలో చికిత్స అందుతోంది. 

More Telugu News