golden tweet: 'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా అనుష్కశర్మ పెళ్లి ట్వీట్‌!

  • వెల్ల‌డించిన ట్విట్ట‌ర్ ఇండియా
  • ఎక్కువగా ప్ర‌స్తావించిన హీరోగా షారుక్‌
  • హీరోయిన్ దీపికా ప‌దుకునే

తాము పెళ్లి చేసుకున్న‌ట్లు స్ప‌ష్టం చేస్తూ, పెళ్లి ఫొటోను కూడా పోస్ట్ చేస్తూ అనుష్క శ‌ర్మ చేసిన ట్వీట్ 'గోల్డెన్ ట్వీట్ ఆఫ్ ది ఇయ‌ర్‌'గా నిలిచిన‌ట్లు సామాజిక మాధ్య‌మం ట్విట్టర్ ఇండియా వెల్ల‌డించింది. ఇదే ట్వీట్‌ను వేరే ఫొటోతో విరాట్ కోహ్లీ కూడా పోస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా ఈ ఏడాది త‌మ వెబ్‌సైట్లో జ‌రిగిన కొన్ని అంశాలకు సంబంధించిన నివేదిక‌ను కూడా ట్విట్ట‌ర్ వెల్ల‌డించింది.

ఈ నివేదిక ప్ర‌కారం బాలీవుడ్ న‌టుడు షారుక్ ఖాన్ గురించి ఎక్కువ మంది త‌మ ట్వీట్ల‌లో ప్ర‌స్తావించార‌ని పేర్కొంది. అలాగే త‌ర్వాతి స్థానాల్లో అమితాబ్ బ‌చ్చ‌న్‌, ఏఆర్ రెహ‌మాన్‌, అక్ష‌య్ కుమార్‌, వ‌రుణ్ ధావ‌న్‌లు ఉన్న‌ట్లుగా తెలిపింది. ఇక హీరోయిన్ల‌లో దీపికా ప‌దుకునే గురించి ఎక్కువ మంది ప్ర‌స్తావించార‌ని, ఆమె త‌ర్వాతి స్థానాల్లో ఆలియాభ‌ట్‌, ప్రియాంక చోప్రా, శ్ర‌ద్ధా క‌పూర్‌, భూమీ ఫ‌డ్నేక‌ర్‌లు ఉన్న‌ట్లుగా పేర్కొంది. ఎక్కువగా ప్ర‌స్తావించిన సినిమాలుగా షారుక్ ఖాన్ 'రాయిస్‌', స‌ల్మాన్ ఖాన్ 'టైగ‌ర్ జిందా హై', 'ట్యూబ్‌లైట్‌', అక్ష‌య్ కుమార్ 'టాయ్‌లెట్ ఏక్ ప్రేమ్ క‌థా' చిత్రాలు నిలిచాయి.

More Telugu News