brahmans: దుష్ప్రచారాలకు స్వస్తి చెప్పాలి.. కుయుక్తులు మానుకోవాలి: ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్

  • 'బ్రాహ్మణ కార్పోరేషన్‌లో భోక్తలు' పేరిట ఓ వార్త ప్రచురితమైంది
  • అందులో నిజం లేదు
  • కార్యకలాపాలన్నీ పూర్తిగా అన్‌లైన్ విధానంలోనే జ‌రుగుతున్నాయి
  • మోసాలు జరిగితే ఎంతటి వారినైనా వదలిపెట్టం

బ్రాహ్మణ కార్పోరేషన్ గురించి దుష్ప్రచారాలకు స్వస్తి చెప్పాలని, కుయుక్తులు మానుకోవాలని సూచిస్తూ ఈ రోజు ఏపీ బ్రాహ్మణ కార్పోరేషన్ పత్రికా ప్రకటన విడుదల చేసింది. "బ్రాహ్మణ కార్పోరేషన్‌లో భోక్తలు పేరిట ఈ రోజు ఒక దినపత్రికలో వార్త ప్రచురితమైంది.. అందులో నిజం లేదు. కార్పోరేషన్ కార్యకలాపాలన్నీ పూర్తిగా కంప్యూటీకరించబడి అన్ని కార్యకలాపాలు అన్‌లైన్ విధానంలోనే కొనసాగుతున్నాయి.

ఈ విధానంలో అవినీతికి, బంధు ప్రీతికి, అలసత్వానికి ఆస్కారం లేదు. లబ్దిదారులందరూ సమన్వయంతో అంకిత భావంతో కృషి చేస్తున్నారు. మహిళా డైరెక్టరుపై వచ్చిన నిజానిజాల నిర్ధారణ కోసం శాఖాపరమైన విచారణ జరిపిస్తాం. దోషులని తేలితే ఎంతటి వారినైనా వదలపెట్టే ప్రసక్తేలేదు. కఠిన చర్యలు తీసుకుంటాం. బ్రాహ్మణ కార్పోరేషన్ వ్యవహారాల పట్ల బ్రాహ్మణ ప్రజలందరూ సంతృప్తిగా ఉన్నారు. మా కార్పోరేషన్‌పై అసత్య ప్రచారం వద్దు" అని అందులో పేర్కొన్నారు.  

More Telugu News