subramanian swamy: డ్రెస్ మార్చండి.. మందు మానేయండి!: బీజేపీ మంత్రులకు సుబ్రహ్మణ్యస్వామి సూచనలు

  • విదేశీ దుస్తులు ధరించకూడదు
  • ఇది విదేశీ బానిసత్వానికి లొంగిపోవడమే
  • మద్యానికి దూరంగా ఉండాలి
బీజేపీ మంత్రులు విదేశీ దుస్తులు ధరించకుండా నిషేధం విధించాలంటూ ఆ పార్టీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ వాతావరణానికి సరిపడే దుస్తులను మాత్రమే ధరించేలా చేయాలని అన్నారు. పాశ్చాత్య సంస్కృతిని ప్రతిబింబించే దుస్తులను ధరించడమంటే... విదేశీ బానిసత్వానికి లొంగిపోవడమేనని చెప్పారు. మన వాతావరణానికి అనుకూలమైన దుస్తులను ధరించేలా బీజేపీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.

 ఇదే విధంగా బీజేపీ మంత్రులు మద్యానికి కూడా దూరంగా ఉండాలని అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 49 మద్య నిషేధాన్ని సూచిస్తోందని... దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తాను అనడంలేదని, కాకపోతే క్రమశిక్షణలో దీన్ని కూడా భాగం చేసుకోవాలని సూచిస్తున్నానని చెప్పారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో జరిగిన పండిట్ మదన్ మోహన్ మాలవీయ జయంత్యుత్సవాల్లో ఎన్డీయే మంత్రులు పాల్గొనలేదని ట్విట్టర్ ద్వారా ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ మంత్రుల దుస్తుల గురించి ఆయన మాట్లాడారు. 
subramanian swamy
BJP

More Telugu News