త్రివిక్రమ్ నా రూమ్మేట్ .. అయినా ఎప్పుడూ ఛాన్స్ అడగలేదు: ఆర్పీ పట్నాయక్

26-12-2017 Tue 16:21
  • త్రివిక్రమ్ .. నేను .. సునీల్ రూమ్మేట్స్ 
  • నేను చేసిన ఆల్బమ్ కి త్రివిక్రమ్ లిరిక్ రైటర్ 
  • ఎవరినీ ఛాన్స్ అడగడం నాకు ఇష్టం ఉండదు
సంగీత దర్శకుడిగా తాను కెరియర్ ను మొదలు పెట్టడానికి దారితీసిన పరిస్థితులను గురించి ఆర్పీ పట్నాయక్ ప్రస్తావించారు. "నేను సినిమాల్లోకి రావడానికి ముందు 'ఆనందం' అనే ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేశాను. త్రివిక్రమ్ శ్రీనివాస్ నా రూమ్మేట్ .. ఆయన ఈ ఆల్బమ్ కి లిరిక్ రైటర్. సునీల్ కూడా మా రూమ్మేట్ గానే ఉండేవాడు" అని చెప్పారు.

 'అలాంటప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకుడు అయిన తరువాత మీకెందుకు అవకాశం ఇవ్వలేదు?' అనే ప్రశ్న అలీ నుంచి ఆయనకి ఎదురైంది. అప్పుడు ఆర్పీ స్పందిస్తూ త్రివిక్రమ్ 'ఫస్టు సినిమాగా 'నువ్వే నువ్వే' చేశాడు .. అది స్రవంతి బ్యానర్ లోది. ఆ బ్యానర్ కి సంగీత దర్శకుడిగా కోటి గారు వుండేవారు. త్రివిక్రమ్ తాను చేసే సినిమాకి ఆర్పీ కరెక్ట్ అనుకున్న రోజున నన్ను తప్పకుండా పిలుస్తాడు .. నేను అడక్కూడదు. నేను 99 శాతం అవుట్ పుట్ ఇస్తాననీ .. మరో సంగీత దర్శకుడైతే 100 శాతం అవుట్ పుట్ ఇస్తాడని త్రివిక్రమ్ అనుకుంటే, వేరే దర్శకుడిని ఆయన తీసుకుకోవడమే కరెక్ట్. నేను ఎవరికీ ఆబ్లిగేషన్ కాకూడదనేది నా అభిప్రాయం" అంటూ చెప్పుకొచ్చారు.