sharwanand: సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా లేనట్టేనట!

  • హను రాఘవపూడితో శర్వానంద్ 
  • ఆ తరువాత ప్రాజెక్టు హరీశ్ శంకర్ తో 
  • సుధీర్ వర్మతో సినిమా డౌట్ అంటూ టాక్      

'స్వామిరారా'.. 'కేశవ' సినిమాలతో దర్శకుడిగా సుధీర్ వర్మ తన సత్తా చాటుకున్నాడు. తన తదుపరి సినిమాను ఆయన శర్వానంద్ తో ప్లాన్ చేసుకున్నాడు. మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథలో చేయడానికి శర్వానంద్ అంగీకరించినట్టు వార్తలు కూడా వచ్చాయి. మాఫియా డాన్ గా రెండు గెటప్పుల్లో శర్వానంద్ కనిపించనున్నాడని చెప్పారు.

హారిక హాసిని సంస్థ వారు మారుతి - చైతూ సినిమాతో పాటు ఈ సినిమాను కూడా వచ్చేనెల మొదటివారంలో పట్టాలెక్కించాలనుకున్నారు. అయితే ఈ కథ విషయంలో కొన్ని సూచనలు చేసిన శర్వానంద్, హను రాఘవపూడితో మరో ప్రాజెక్టును మొదలుపెట్టేశాడు. అంతేకాదు .. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో హరీశ్ శంకర్ తో ఓ సినిమా చేయడానికి కూడా అంగీకరించాడట. దాంతో ఇక సుధీర్ వర్మతో శర్వానంద్ సినిమా లేనట్టేననే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. మరి ఈ ప్రచారంపై హారిక హాసిని వారు .. సుధీర్ వర్మ ఎలా స్పందిస్తారో చూడాలి.      

More Telugu News