netizens: మరోసారి నెటిజన్లను ఫిదా చేసిన ధోనీ కూతురు జివా.. వీడియో చూడండి!

  • పాట‌పాడుతూ క్రిస్మ‌స్ విషెస్‌
  • తండ్రి ఒడిలో కూర్చుని ముద్దుగా పాట‌పాడిన జివా
  • ముఖం కూడా చూపిస్తే బాగుండునంటున్న నెటిజ‌న్లు

క్రికెట‌ర్ మ‌హేంద్ర సింగ్ ధోనీ, సాక్షిల ముద్దుల కూతురు జివా... వ‌య‌సు రెండేళ్లే కానీ సోష‌ల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం అద్భుతం. ఇప్ప‌టివ‌ర‌కు ముద్దు ముద్దుగా మ‌ల‌యాళీ పాట‌లు పాడి అంద‌రినీ ఆక‌ట్టుకున్న జివా, కొత్తగా క్రిస్మ‌స్ విషెస్‌ను పాట రూపంలో చెప్పింది. ఇప్పుడు ఆ వీడియో చూసి నెటిజ‌న్లు ఫిదా అయిపోతున్నారు.

ట్రాఫిక్‌లో ఆగి ఉన్న కారులో తండ్రి ఒడిలో కూర్చుని, అద్దం వైపు చూస్తూ..'వీ విష్ యూ ఎ మెర్రీ క్రిస్మ‌స్ అండ్ ఎ హ్యాపీ న్యూ ఇయ‌ర్‌' అంటూ జివా ముద్దు ముద్దుగా పాడ‌టం ఈ వీడియోలో చూడొచ్చు. అయితే ఈ వీడియోలో జివా వెన‌క నుంచి మాత్ర‌మే క‌నిపిస్తుంది. దీంతో ముఖం కూడా చూపించి ఉంటే బాగుండున‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

More Telugu News