jaqueline fernandez: 'కామసూత్ర' పేరుతో హోటల్స్ ప్రారంభించిన బాలీవుడ్ నటి

  • హోటల్ వ్యాపారంలోకి జాక్వెలిన్
  • కామసూత్ర పేరుతో చైన్ హోటల్స్
  • హాట్ టాపిక్ గా మారిన హోటల్ పేరు

నేటి సినీ తారలు నటనతో పాటు, వివిధ రకాల వ్యాపారాలను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఫ్యాషన్, హోటల్, ఫిట్ నెస్ రంగాల్లో వీరు పెట్టుబడులు పెడుతున్నారు. తాజాగా బాలీవుడ్ భామ జాక్వలిన్ ఫెర్నాండెజ్ కూడా వ్యాపార రంగంలోకి అడుగుపెట్టింది. శ్రీలంకలో చైన్ హోటల్స్ బిజినెస్ ను ప్రారంభించింది. అయితే, తన హోటల్స్ కు ఆమె పెట్టుకున్న పేరే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కామసూత్ర పేరుతో హోటల్స్ ను ఆమె ప్రారంభించింది. ఈ పేరును జాక్వలిన్ ప్రకటించిన వెంటనే చర్చనీయాంశంగా మారిపోయింది.

  • Loading...

More Telugu News