baahubali: రష్యన్ భాషలో విడుదల కాబోతున్న 'బాహుబలి 2'... ట్రైలర్ చూడండి!

  • వ‌చ్చే నెల విడుద‌ల‌
  • డిసెంబ‌ర్ 29న‌ జ‌ప‌నీస్‌లో విడుద‌ల‌
  • ర‌ష్య‌న్ ట్రైల‌ర్ ట్వీట్ చేసిన శోభు యార్ల‌గ‌డ్డ‌

రికార్డుల మీద రికార్డులు సృష్టించిన 'బాహుబ‌లి 2' చిత్రం త్వ‌ర‌లో ర‌ష్య‌న్ భాష‌లో విడుద‌ల కానుంది. జ‌న‌వ‌రి 2018లో ఈ చిత్రంలో ర‌ష్యాలో విడుద‌లకాబోతోంద‌ని నిర్మాత శోభు యార్ల‌గ‌డ్డ తెలిపారు. అంతేకాకుండా బాహుబ‌లి 2 ర‌ష్య‌న్ భాష ట్రైల‌ర్‌ను కూడా ట్వీట్ చేశారు. ఇప్ప‌టికే ఈ చిత్రం డిసెంబ‌ర్ 29న జ‌ప‌నీస్ భాష‌లో విడుద‌ల‌ కావడానికి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇప్ప‌టికే త‌న పేరు మీద కొత్త కొత్త రికార్డుల‌ను న‌మోదు చేసుకున్న 'బాహుబ‌లి 2', ర‌ష్య‌న్‌, జ‌ప‌నీస్ భాషల్లో కూడా మంచి విజ‌యం సాధిస్తుంద‌ని నిర్మాత‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఏదేమైనా, తెలుగు సినిమా ఖ్యాతిని ప్ర‌పంచ న‌లుమూల‌ల‌కు బాహుబ‌లి 2 తీసుకెళ్లింద‌న‌డంలో ఏ మాత్రం అతిశ‌యోక్తి లేదు.

More Telugu News