nagachaitanya: మారుతి మూవీలో చైతూ పాత్ర అలా వుంటుందట!

  • మారుతి తదుపరి చిత్రంగా 'శైలజా రెడ్డి అల్లుడు'
  • కథానాయకుడిగా నాగచైతన్య 
  • 'ఇగో' కలిగిన వ్యక్తిగా ఆయన పాత్ర 
  • త్వరలో సెట్స్ పైకి   

మారుతి దర్శకత్వంలో నాగచైతన్య కథానాయకుడిగా ఒక సినిమా సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతోంది. ఈ సినిమాకి 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. చైతూ ఇంతవరకూ చేసిన పాత్రలకు భిన్నంగా ఈ పాత్ర ఉంటుందని అంటున్నారు.

'కొత్తజంట' సినిమాలో హీరోను స్వార్థపరుడిగా చూపించిన మారుతి, 'భలేభలే మగాడివోయ్' సినిమాలో హీరోని మతిమరుపు కలిగినవాడిగా చూపించి నవ్వులు పూయించాడు. ఆ తరువాత 'మహానుభావుడు'లో హీరోను అతి శుభ్రత కలిగినవాడిగా చూపించి ఆడియన్స్ ను అలరించాడు. ఇక 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమాలో హీరోపాత్ర 'ఇగో'తో కూడినదిగా వుంటుందట. ఈ పాత్రను ఆయన డిజైన్ చేసిన తీరు అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెబుతున్నారు.   

More Telugu News