Rahul Gandhi: రాహుల్ గాంధీపై మనసు పారేసుకున్న 107 ఏళ్ల బామ్మగారు.. ప్రేమతో చిలిపి సమాధానం ఇచ్చిన కాంగ్రెస్ అధ్యక్షుడు!

  • రాహుల్ అందగాడంటూ సిగ్గుపడిపోయిన శతాధిక వృద్ధురాలు
  • విషయాన్ని రాహుల్‌కు చెప్పిన మనవరాలు
  • నా తరుపున బిగి కౌగిలి ఇవ్వాలంటూ చిలిపిగా ట్వీట్ చేసిన కాంగ్రెస్ అధ్యక్షుడు

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై శతాధిక వృద్ధురాలు మనసు పారేసుకుంది. 107వ వసంతంలోకి అడుగుపెట్టి ఘనంగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న బామ్మ.. ‘‘రాహుల్ గాంధీ అందగాడు.. అతడిని కలుస్తా’’ అంటూ సిగ్గుల మొగ్గలైంది. ఫొటోలో కనిపిస్తున్న ఈ బామ్మ 107వ బర్త్ డేను జరుపుకుంటూ కేక్ కట్ చేసింది. ఈ  సందర్భంగా ఆమె మనవరాలు దీపాలి సికంద్ బర్త్ డే గిఫ్ట్‌గా ఏం కావాలని అడిగింది. దీనికి సమాధానంగా.. 'రాహుల్ అందగాడు.. అతడిని కలవాలని ఉంది' అని చెప్పి సిగ్గుపడిందట. తమ మధ్య జరిగిన సంభాషణను దీపాలి ట్విట్టర్ ద్వారా రాహుల్‌కు తెలిపింది.

దీనికి స్పందించిన రాహుల్.. బామ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ, అంతే చిలిపిగా స్పందించారు. 'నా తరపున మీరే ఒకసారి మీ బామ్మగారిని గట్టిగా కౌగిలించుకోండి..' అంటూ ట్వీట్ చేశారు. అంతేకాదు, ఫోన్ చేసి బామ్మకు శుభాకాంక్షలు కూడా చెప్పడంతో ఆమె ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతోంది. ఇక ఈ ట్వీట్ క్షణాల్లోనే వైరల్ అయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు వివిధ కామెంట్లతో రక్తికట్టిస్తున్నారు.
Rahul Gandhi
Congress
Twitter

More Telugu News