MLC: ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన చంద్రబాబుకు కృతఙ్ఞతలు: కేఈ ప్రభాకర్

  • ఎమ్మెల్సీ టికెట్ కోసం బాబుపై ఎలాంటి ఒత్తిడి చేయలేదు
  • మేము చేసిన కృషికి గుర్తింపు లభించింది
  • వైసీపీ వ్యాఖ్యలు అర్థరహితం 
కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చిన సీఎం చంద్రబాబునాయుడుకి తన కృతఙ్ఞతలు తెలియజేసుకుంటున్నానని కేఈ ప్రభాకర్ అన్నారు. తనకు ఎమ్మెల్సీ టికెట్ కేటాయించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాము చేసిన కృషికి గుర్తింపు లభించిందని సంతోషం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్సీ టికెట్ కోసం చంద్రబాబుపై ఎలాంటి ఒత్తిడి చేయలేదని అన్నారు. ఈ ఎన్నికలలో తాము పోటీ చేయమంటూ వైసీపీ చేసిన ప్రకటనపై ఆయన స్పందిస్తూ, ఆ వ్యాఖ్యలు అర్థరహితమని, ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ గతంలో రెండు సార్లు పోటీ చేసి పరాజయం పాలైందని ఎద్దేవా చేశారు.
MLC
K R Prabhakar
Chandrababu

More Telugu News