jayasuda: ఆ అబ్బాయి నాతో సెల్ఫీ తీసుకుని 'మీరు డా.శైల‌జ క‌దా?' అన్నాడు: జ‌య‌సుధ‌

  • పుదుచ్చేరిలో ఈ అనుభ‌వం ఎదురైంది
  • ఆ అబ్బాయి ఆంధ్రకు చెందిన వ్య‌క్తి కాదు
  • 'ఎవ‌డు' సినిమాలో నా పాత్ర పేరు డా.శైల‌జ‌
  • అందుకే అలా అడిగాడు

దిల్ రాజు డ‌బుల్ హ్యాట్రిక్ సాధించినందుకు శుభాకాంక్ష‌లు తెలుపుతున్నాన‌ని సినీ న‌టి జ‌య‌సుధ అన్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో 'దిల్ రాజు స‌క్సెస్ జ‌ర్నీ' పేరుతో వేడుక జ‌రుపుకుంటున్నారు. ఈ కార్యక్రమానికి హాజ‌రైన జ‌య‌సుధ మాట్లాడుతూ తాను ఈ ఏడాది దిల్ రాజు నిర్మించిన 'శ‌త‌మానం భ‌వ‌తి' సినిమాలో న‌టించా‌న‌ని, ఆయన నిర్మించిన చాలా సినిమాల్లో మంచి పాత్ర‌ల్లో న‌టించాన‌ని అన్నారు. ఈ సంద‌ర్భంగా త‌న‌కు ఓ సారి ఎదురైన ఓ అనుభ‌వాన్ని ఆమె వివ‌రించారు.

పుదుచ్చేరిలో ఓ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని తాను కారు ఎక్కుతుండగా, ఒక అభిమాని వ‌చ్చి సెల్ఫీ తీసుకుంటాన‌ని అడిగాడ‌ని జ‌య‌సుధ‌ అన్నారు. ఆ అబ్బాయి ఆంధ్రకు చెందిన వ్య‌క్తి కాద‌ని చెప్పారు. సెల్ఫీ తీసుకున్న త‌రువాత 'మీరు డా.శైల‌జ క‌దా?' అని అడిగాడ‌ని తెలిపారు. తాను న‌టించిన 'ఎవ‌డు' సినిమా హిందీలో డ‌బ్ అయింద‌ని, ఆ సినిమాలో త‌న పేరు డా.శైల‌జ అని, అందుకే ఆ అబ్బాయి తనను 'డా.శైల‌జ' అని అన్నాడ‌ని చెప్పారు.

More Telugu News