rana: రానాతోనే 'హిరణ్యకశిప' ఫైనల్!

  • గుణశేఖర్ దర్శకత్వంలో 'హిరణ్యకశిప'
  • కథానాయకుడిగా రానా పేరు తెరపైకి 
  • త్వరలోనే అధికారిక ప్రకటన

'రుద్రమదేవి' సినిమా తరువాత గుణశేఖర్ నుంచి రాబోయే సినిమా కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 'హిరణ్యకశిప' అనే టైటిల్ తో గుణశేఖర్ ఒక సినిమా చేయనున్నారనే వార్త బయటికి వచ్చింది. ప్రహ్లాదుడి చరిత్రే అయినా .. అది హిరణ్య కశిపుని కోణంలో కొనసాగుతుందని గుణశేఖర్ చెప్పారు.

ఈ సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సురేశ్ బాబు నిర్మించనున్నాడనీ,  టైటిల్ రోల్ ను రానా చేయనున్నాడనే టాక్ వినిపించింది. దాదాపు ఈ ప్రాజెక్టు ఖరారైపోయిందనేది తాజా సమాచారం. ఇప్పటికే గుణశేఖర్ పక్కాగా స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారట. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన చేసి, ఆ తరువాత సెట్స్ పైకి వెళ్లే ఆలోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టు విషయంలో రానా ఉత్సాహంగా వున్నాడని అంటున్నారు.      

More Telugu News