Vishal: దినకరన్ కు మద్దతు పలికిన హీరో విశాల్!

  • సంచలన ప్రకటన చేసిన విశాల్
  • దినకరన్ కు అండగా ఉంటా
  • ఆర్కే నగర్ సమస్యలు పరిష్కరించండి
  • ట్విట్టర్ ఖాతాలో వ్యాఖ్య
ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో తలపడి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావించి విఫలమైన దక్షిణాది హీరో విశాల్, ఇప్పుడు సంచలన ప్రకటన చేశాడు. అన్నాడీఎంకే అసమ్మతి వర్గం నేత, స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఘన విజయం సాధించిన దినకరన్ కు అండగా ఉంటానని ప్రకటించాడు. ఆర్కే నగర్ లో ఎన్నో సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించాలని, అందుకు తనవంతు సహకారాన్ని అందిస్తానని చెప్పాడు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ కుక్కర్ తోనే వంట చేసుకునే పరిస్థితి తేవాలని అన్నాడు. నీటి సదుపాయాన్ని దగ్గర చేయాలని సూచించాడు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను ఉంచాడు. విజయం సాధించిన దినకరన్ కు తన హృదయ పూర్వక అభినందనలని చెప్పాడు.
Vishal
Tamilnadu
RK Nagar
Dinakaran

More Telugu News