unemployment allowance: ఏపీలో నిరుద్యోగ భృతికి షరతులు.. ఆ వివరాలు ఇవిగో!

  • కనీసం ఇంటర్, ఐటీఐ చదవి ఉండాలి
  • కుటుంబంలో ఒకరికే వర్తింపు
  • ఏపీలోనే పుట్టి ఉండాలి.. పేదలై ఉండాలి

ఉద్యోగాలు లభించక ఇబ్బందులను ఎదుర్కొంటున్న యువతకు ఆసరాగా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతిని ఇవ్వనున్న సంగతి తెలిసిందే. అయితే, ఎవరెవరికి ఈ భృతిని ఇస్తారు? ఎంత మందికి ఇస్తారనే అనుమానాలు అందర్లోనూ నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఒక డ్రాఫ్ట్ ను విడుదల చేసింది. ఇందులో నిరుద్యోగ భృతికి సంబంధించిన టర్మ్స్ అండ్ కండిషన్స్ ను పేర్కొన్నారు. అవేంటో చూద్దాం.

  • దరఖాస్తుదారుడి పేరు ఉపాధి కల్పన కేంద్రంలో నమోదై ఉండాలి.
  • ఆన్ లైన్ లో కూడా రిజిస్టరై ఉండాలి.
  • కనీసం ఇంటర్ చదవి ఉండాలి.
  • టెక్నికల్ అయితే కనీసం ఐటీఐ చదివి ఉండాలి.
  • 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
  • పేద కుటుంబాలవారికే ఈ భృతిని వర్తింపజేస్తారు. 
  • కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వర్తింపు. 
  • సంబంధిత కుటుంబం రేషన్ తీసుకుంటూ ఉండాలి. 
  • స్వయం ఉపాధి పథకాల్లో కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో కానీ లబ్ధిదారులుగా ఉన్నవారు అనర్హులు. 
  • ప్రవేట్ రంగంలో పని చేస్తున్నవారు, ప్రభుత్వ సర్వీసుల నుంచి తొలగింపబడిన వారు అనర్హులు. 
  • దరఖాస్తు చేసుకున్నవారు నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ పొందాలి. 
  • ఎక్కువ వయసు ఉన్నవారికే ప్రాధాన్యత. 
  • ఒకే వయసు ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నట్టైతే... అవసరమైన విద్యార్హత ఉన్నవారిని సీనియర్ గా పరిగణిస్తారు. 
  • వయసు, విద్యార్హతలు సమానంగా ఉంటే... మార్కులను కొలమానంగా తీసుకుంటారు. 
  • ఏపీలో జన్మించినవారే అర్హులు. 
  • ఒకటి కంటే ఎక్కువ డిగ్రీలు ఉన్నవారు కూడా అర్హులే. 

More Telugu News