President of India: తెలుగు 'చంద్రులు' కలిసిన శుభవేళ... గవర్నర్ @ హోమ్ చిత్రమాలిక!
- రాష్ట్రపతి గౌరవార్థం గవర్నర్ విందు
- హాజరైన కేసీఆర్, చంద్రబాబు
- చిత్ర పరిశ్రమ ప్రముఖులు కూడా
శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ గౌరవార్థం గవర్నర్ నరసింహన్ విందు ఇచ్చిన వేళ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు చాలాకాలం తరువాత మరోసారి కలిశారు. వీరిద్దరూ కలిసి సరదాగా ముచ్చటించుకున్నారు కూడా. పలువురు ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరైన ఈ విందుకు చలనచిత్ర సీమకు చెందిన పలువురు ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఆ దృశ్యాలను మీరూ చూడండి.
మధ్యలో చంద్రబాబు, అటూ ఇటూ రాష్ట్రపతి, కేసీఆర్...
సరదా సంభాషణలకు వేళాయె...
గవర్నర్ దంపతులతో కేసీఆర్, చంద్రబాబు
రాష్ట్రపతి దంపతులతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్