Chandrababu: వాజ్‌పేయికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ఏపీ సీఎం.. గొప్ప దార్శనికుడు అంటూ కొనియాడిన బాబు

  • వాజ్‌పేయి హయాంలో సైబరాబాద్ నిర్మాణం
  • మంగళగిరి ఎయిమ్స్‌కు ఆయన పేరు సూచించింది నేనే
  • ఫోఖ్రాన్ అణు పరీక్షలతో దేశ శక్తిని ప్రపంచానికి చాటారంటూ కొనియాడిన చంద్రబాబు
మాజీ ప్రధాని, బీజేపీ సీనియర్ నేత అటల్ బిహారీ వాజ్‌పేయికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వాజ్‌పేయి గొప్ప దార్శనికుడు అని కొనియాడిన బాబు మంగళగిరి వద్ద ఎయిమ్స్‌కు ఆయన పేరును సూచించింది తానేనని అన్నారు. వాజ్‌పేయి పాలనాదక్షుడని, పండితుడు, కవి అని అన్నారు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే తాను సైబరాబాద్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఫోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించి భారత సత్తాను ప్రపంచ దేశాలకు చాటారని చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలో మౌలిక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. వాజ్‌పేయి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.
Chandrababu
Atal Bihari Vajpayee
BJP
Birthday

More Telugu News