అందంగా ఉన్నావంటూ నిందితురాలితో సెల్ఫీ... టూర్ కు వెళ్దామా? అని అడిగి చిక్కుల్లో పడ్డ గుజరాత్ కానిస్టేబుల్!

  • అక్రమ మద్యం కేసులో పట్టుబడ్డ మహిళ
  • చాలా అందంగా ఉన్నావని పొగడ్తలు
  • మౌంట్ అబూ వెళ్దామా అని అడిగిన కానిస్టేబుల్
  • కేసు నమోదు, విచారిస్తున్నామన్న పోలీసులు
ఎంతో అందంగా, ఆకర్షణీయంగా ఉందని అనుకుంటూ, ఓ నిందితురాలితో సెల్ఫీ దిగటమే కాకుండా, ఆమెను తనతో కలసి టూరుకు రావాలని కోరిన ఓ గుజరాత్ కానిస్టేబుల్ చిక్కుల్లో పడ్డాడు. మరిన్ని వివరాల్లోకి వెళితే, అహ్మదాబాద్ పరిధిలోని దరియాపూర్ ప్రాంతంలో అమీనా షేక్ అనే మహిళ, కారులో మద్యం బాటిళ్లతో వెళుతుండగా, మొబైల్ పోలీసుల టీమ్ పట్టుకుంది. ఆ టీమ్ లోని శైలేష్ అనే కానిస్టేబుల్, కారులో ఆమెతో సెల్ఫీ దిగాడు. చాలా అందంగా ఉన్నావని పొగుడుతూ, ముఖానికి ఏ క్రీమ్ రాసుకుంటావని ప్రశ్నించాడు. సరదాగా మౌంట్ అబూ వరకూ వెళ్దాం, వస్తావా? అని ప్రశ్నించాడు.

దీంతో తనను స్టేషన్ కు తీసుకెళ్లగానే జరిగిన విషయమై అమీనా ఫిర్యాదు చేయగా, విచారణకు ఆదేశించినట్టు ఏసీపీ బలదేవ్ దేశాయ్ వెల్లడించారు. తాను కేసులో నిందితురాలినే అయినా, తన గౌరవానికి భంగం కలిగిందని, దీన్ని సహించేది లేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలిపారు. కాగా, ఈ ఘటనపై దర్యాఫ్తు చేస్తున్నామని, కానిస్టేబుల్ తప్పు చేశాడని తేలితే, అతనిపై శాఖా పరమైన క్రమశిక్షణా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.
Go Back to Shorts
Gujarath
Illicit Liquor
Selfi
Ahmadabad

More Telugu News