President of India: రాష్ట్రపతికి స్వాగతం పలికిన గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్

  • శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు చేరుకున్న కోవింద్
  • ఈ రోజు రాత్రి  రాజ్ భవన్ లో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విందు 
  • ఈ నెల 26న రాష్ట్రపతి భవన్ లో ‘ఎట్ హోం’ కార్యక్రమం
శీతాకాల విడిది నిమిత్తం హైదరాబాద్ చేరుకున్న భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు ఘన స్వాగతం లభించింది. హకీంపేట్ విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ నరసింహన్, సీఎం కేసీఆర్ స్వాగతం పలికారు. శీతాకాల విడిదిలో భాగంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన నాలుగు రోజుల పాటు బస చేయనున్నారు.

 ఈ సందర్భంగా ఈ రోజు రాత్రి ఏడు గంటలకు రాజ్ భవన్ లో రాష్ట్రపతి దంపతులకు గవర్నర్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 26వ తేదీ రాత్రి రాష్ట్రపతి భవన్ లో ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. కాగా, రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్, హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ ఉన్నారు. 
President of India
Hyderabad

More Telugu News