rajesh: రాజేష్ మాటలు నమ్మి నా భర్తను అన్యాయంగా చంపుకున్నా: పోలీస్ విచారణలో స్వాతి

  • సుమారు ఐదుగంటల పాటు పోలీసుల విచారణ
  • రాజేష్ మాయలో పడి అతను చెప్పినట్టే చేశాను
  • సినిమా కథల్లో మాదిరి జరిగిపోతుందని భావించానన్న స్వాతి

రాజేష్ మాటలు నమ్మి తన భర్త సుధాకర్ రెడ్డిని అన్యాయంగా చంపుకున్నానంటూ పోలీసుల ఎదుట నిందితురాలు స్వాతి కన్నీటి పర్యంతమైంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సుధాకర్ రెడ్డి హత్య కేసులో రెండో నిందితురాలు స్వాతిని నాగర్ కర్నూల్ జిల్లా పోలీసులు మరోమారు విచారించారు.

మహబూబ్ నగర్ జిల్లా జైలు నుంచి నిన్న ఉదయం అదుపులోకి తీసుకున్న పోలీసులు, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు. సుమారు ఐదు గంటల పాటు విచారణ నిర్వహించారు. హత్య కేసుకు సంబంధించిన అదనపు సమాచారం రాబట్టే నిమిత్తం నాలుగురోజులు కావాలని కోర్టును కోరగా, కేవలం రెండు రోజులకు మాత్రమే అనుమతించింది. రాజేష్ మాయలో పడి అతను చెప్పినట్టే చేశానని, సినిమా కథల్లో మాదిరి జరిగిపోతుందని భావించానని ఆ విచారణలో పేర్కొంది.

 కాగా, సుధాకర్ రెడ్డి హత్య కేసు మొదటిరోజు విచారణ సందర్భంలో..హత్య చేసిన రోజున వారు ధరించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయనే విషయమై అస్పష్టంగా సమాధానమివ్వడం తెలిసిందే. ఈ విచారణ అనంతరం, హత్య రోజున స్వాతి ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సుధాకర్ రెడ్డి తలపై కొట్టిన ఇనుపరాడ్ ను, గాయపడ్డ సుధాకర్ రెడ్డి రక్తాన్ని తుడిచిన దుస్తులను స్వాతి ఇంట్లో బీరువా నుంచి తీసుకొచ్చారు. 

  • Loading...

More Telugu News