shilpa shetty: ఆ వ్యాఖ్యలు ఇబ్బంది కలిగించి ఉంటే నన్ను క్షమించండి: శిల్పా శెట్టి

  • నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు
  • ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదు
  • భారతదేశంలో పుట్టినందుకు గర్విస్తున్నా: ఓ ట్వీట్ లో శిల్పాశెట్టి
'టైగ‌ర్ జిందా హై' చిత్ర ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఓ రియాలిటీ షోలో న్యాయనిర్ణేతగా పాల్గొన్న నటి శిల్పాశెట్టి  చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన విషయం తెలిసిందే. ‘భాంగ్రీ వర్గం వారు చేసిన డ్యాన్స్ లా ఉంది’ అనే కామెంట్లపై అభ్యంతరాలు వ్యక్తమైన నేపథ్యంలో శిల్పాశెట్టి స్పందించింది. తన ట్విట్టర్ ఖాతా ద్వారా క్షమాపణలు చెబుతున్నట్టు పేర్కొంది.

ఆ ఇంటర్వ్యూలో తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, తాను ఎవరినీ కించపరిచేలా మాట్లాడలేదని, ఒకవేళ, తన మాటలు ఇబ్బంది కలిగించే ఉంటే తనను క్షమించాలని ఆ ట్వీట్ లో కోరింది. భిన్న సంస్కృతులకు, మతాలకు నిలయమైన మన దేశంలో పుట్టినందుకు తాను గర్వపడుతున్నానని శిల్పా పేర్కొంది.

కాగా, ఈ రియాలిటీ షోలో ప్రముఖ నటుడు సల్మాన్, శిల్పాశెట్టి పాల్గొన్నారు. భాంగీ మైనార్టీ వర్గానికి చెందిన వారిపై చేసిన ఈ వ్యాఖ్యల నేపథ్యంలో సల్మాన్, శిల్పాశెట్టిపై కేసు నమోదైన సంగతి విదితమే. ఈ ఘటనపై సల్మాన్ ఖాన్ ఇంకా స్పందించాల్సి ఉంది.
shilpa shetty
Bollywood

More Telugu News