Tembin: ఫిలిప్పీన్స్ లో జల ప్రళయం... 182 మంది మృతి

  • దూసుకొచ్చిన తుపాను 'టెంబిన్'
  • ముంచెత్తిన వరదలు
  • 153 మంది గల్లంతు
  • వేలాది మంది నిరాశ్రయులు

పెను తుపాను 'టెంబిన్' సృష్టించిన జల ప్రళయానికి ఫిలిప్పీన్స్ అతలాకుతలమైంది. భారీ వర్షాలతో ఒక్కసారిగా మెరుపు వరదలు సంభవించి, పెద్ద ఎత్తున మట్టి కొట్టుకురావడంతో 182 మంది మరణించారు. మరో 153 మంది ఆచూకీ తెలియరాలేదని వెల్లడించిన అధికారులు, వేలమంది నిరాశ్రయులయ్యారని, వారిని ఆదుకునేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు.

కాగా, 'టెంబిన్' ప్రభావం అధికంగా ఉంటుందని ముందస్తు హెచ్చరికలు జారీ చేసినా, ప్రజలు పట్టించుకోలేదని, అందువల్లే ప్రాణనష్టం అధికంగా ఉందని వ్యాఖ్యానించారు. ఏటా ఫిలిప్పీన్స్ ను 20కి పైగా తుపానులు తాకుతుంటాయని, వీటి వల్ల దక్షిణ పిలిప్పీన్స్ దీవులకు నష్టం తక్కువేనని, ఈ కారణంగానే ప్రజలు హెచ్చరికలను ఖాతరు చేయలేదని తెలుస్తోంది. ఇక భారీగా కొట్టుకొచ్చిన వరద మట్టి సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తోంది. దేశంలో రెండో అతిపెద్ద ద్వీపమైన మిన్ టనావోలో నష్టం అధికంగా ఉన్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News