TTV Dinakaran: చెన్నైలో కలకలం... ఆగిన కౌంటింగ్!

  • భారీ ఆధిక్యంలో దినకరన్
  • అన్నాడీఎంకే కార్యకర్తల మాటల యుద్ధం
  • కౌంటింగ్ అధికారులపై దాడి
  • తాత్కాలికంగా నిలిచిన కౌంటింగ్

ఆర్కేనగర్ ఉప ఎన్నికల కౌంటింగ్ లో శశికళ వర్గం అభ్యర్థి టీటీవీ దినకరన్ భారీ ఆధిక్యంలో దూసుకుపోతున్న వేళ, కౌంటింగ్ జరుగుతున్న క్వీన్ మేరీ కాలేజీలో ఎన్నికల అధికారులపై ఆన్నాడీఎంకే కార్యకర్తల దాడి కలకలం రేపింది. టీటీవీ దినకర్ వర్గం కార్యకర్తలతో మొదలైన అన్నాడీఎంకే ఏజంట్లు, కార్యకర్తల మాటల యుద్ధం చినికి చినికి గాలివానగా మారగా, కౌంటింగ్ అధికారులపై వారు దాడికి దిగారు.

దీంతో కౌంటింగ్ ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని రెండు వర్గాలనూ చెదరగొడుతున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి వుంది. అంతకుముందు మూడో రౌండ్ ముగిసేసరికి ఇండిపెండెంట్ గా బరిలోకి దిగిన దినకరన్ కు 7,276 ఓట్లు, అన్నాడీఎంకే మధుసూదనన్ కు 2,737 ఓట్లు, డీఎంకే మరుదు గణేశన్ కు 1,181 ఓట్లు, బీజేపీ నాగరాజన్ కు 66 ఓట్లు వచ్చాయి. నోటాకు 102 ఓట్లు పడ్డాయని అధికారులు ప్రకటించారు.

More Telugu News