Puneet Rajkumar: కన్నడ పవర్ స్టార్ సినిమా 'అంజనీపుత్ర'పై కోర్టు కీలక నిర్ణయం... సినిమా ప్రదర్శన నిలపాలని ఆదేశం

  • హిట్ టాక్ తెచ్చుకున్న అంజనీపుత్ర
  • న్యాయవాదులను కించపరుస్తూ డైలాగులు
  • జనవరి 2 వరకూ సినిమాను ఆపండి
  • బెంగళూరు సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు 

కన్నడ నాట ఇటీవల విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిత్రం 'అంజనీపుత్ర' ప్రదర్శన నిలిపివేయాలని కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ సినిమాలో న్యాయవాదులను కించపరిచేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ, ఓ లాయర్ కోర్టును ఆశ్రయించారు. వెంటనే ఆ సన్నివేశాలను తొలగించాలని న్యాయవాదులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ, సన్నివేశాలను తీసేసే వరకూ చిత్రంపై నిషేధాన్ని విధించాలని కోరారు. ఈ పిటిషన్ ను విచారించిన బెంగళూరు సిటీ సివిల్ కోర్టు న్యాయమూర్తి, జనవరి 2 వరకూ సినిమా ప్రదర్శన నిలిపేయాలని, ఈలోగా లాయర్లను, న్యాయ వ్యవస్థను కించపరిచే డైలాగులను తొలగించాలని పేర్కొంది.

  • Loading...

More Telugu News