Amaravati: దిమ్మ తిరిగే అంచనా వ్యయం... ఏపీ సచివాలయానికి రూ. 2,728 కోట్లు!

  • చదరపు అడుగుకు రూ. 7 వేల పైమాటే
  • నిర్మాణాలు పూర్తయ్యేసరికి మరింతగా పెరిగే అవకాశం
  • ఎంత విలాసవంతమైనా రూ. 3 వేల లోపే ఖర్చవుతుందంటున్న విపక్షాలు
  • అనుకూల కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారని విమర్శలు

నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో ప్రభుత్వం నిర్మింత తలపెట్టిన శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుల నిర్మాణాలకు అంచనా వ్యయాన్ని చూస్తే దిమ్మ తిరిగిపోతోంది. మౌలిక వసతులు, గ్రీనరీని పక్కన బెడితే, సచివాలయానికి రూ. 2,728 కోట్లు, అసెంబ్లీ, హైకోర్టులకు రూ. 2,229 కోట్లు ఖర్చవుతుందని అధికారులు తేల్చారు. అంటే, ఒక్కో చదరపు అడుగుకు ప్రభుత్వం వెచ్చిస్తున్న మొత్తం దాదాపు రూ. 7,170కి పైమాటే. ఇక ఈ అంచనాలు భవిష్యత్తులో పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు దాదాపు రూ. 5 వేల కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్న చంద్రబాబు సర్కారు, త్వరలోనే టెండర్లను పిలవనున్నట్టు సమాచారం.

కాగా, రెండు సంవత్సరాల క్రితం పరిపాలనా నగర నిర్మాణానికి రూ. 6 వేల కోట్లు ఖర్చవుతాయని అంచనా వేసిన ప్రభుత్వం, ఇప్పుడు కేవలం మూడు భవనాలకే సుమారు రూ. 5 వేల కోట్లు అవుతుందని చెప్పడంపై విపక్షాలు విమర్శలు సంధిస్తున్నాయి. ఎంత విలాసవంతమైన భవనమైనా చదరపు అడుగుకు రూ. 3 వేలు కూడా మించదని, ఇక రూ. 7 వేలు అంచనా వ్యయం వేయడం కాంట్రాక్టర్లకు డబ్బు దోచి పెట్టేందుకేనని వైకాపా నేతలు విమర్శిస్తున్నారు.

  • Loading...

More Telugu News