janasena: జ‌న‌సేన సిద్ధాంతాలను తెలుపుతూ ట్వీట్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్‌!

  • కులాలని కలిపే ఆలోచన విధానం
  • మతాల ప్రస్తావన లేని రాజకీయం  
  • భాషల్ని గౌరవించే సంప్రదాయం
  • సంస్కృతులని కాపాడే సమాజం

జ‌న‌సేన పార్టీకి ఏ సిద్ధాంతం లేద‌ని, ఓ క్లారిటీ లేద‌ని ప‌లువురు విమ‌ర్శ‌లు గుప్పిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ నేపథ్యంలో త‌మ సిద్ధాంతాలు ఇవేనంటూ ఆ పార్టీ అధినేత, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఓ ట్వీట్ చేశారు. "కులాలని కలిపే ఆలోచన విధానం.. మతాల ప్రస్తావన లేని రాజకీయం.. భాషల్ని గౌరవించే సంప్రదాయం.. సంస్కృతులని కాపాడే సమాజం.. ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం.. ఇవి దేశపటిష్టతకు మూలాలు.. ఇవే “జనసేన” సిద్ధాంతాలు.." అని ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పేర్కొన్నారు. కాగా, ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ రోజు ఉద‌యం నుంచి వ‌రుస‌గా ట్వీట్లు చేస్తోన్న విష‌యం తెలిసిందే.           

More Telugu News